దేవుడికి సైతం కరోనా ఎఫెక్ట్‌.. విగ్రహాలకు మాస్క్‌లు

దేవుడికి సైతం కరోనా ఎఫెక్ట్‌.. విగ్రహాలకు మాస్క్‌లు
x
Face masks idols
Highlights

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనావైరస్‌ భగవంతుడిని సైతం భయపెడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం వ్యాప్తంగా 3,800 మంది మరణించారు.

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనావైరస్‌ భగవంతుడిని సైతం భయపెడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం వ్యాప్తంగా 3,800 మంది మరణించారు. లక్షాపదివేల మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇక భారత్‌లో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 44కు చేరింది. కోవిడ్‌-19 నుంచి రక్షించేందుకు దేవుని విగ్రహానికి మాస్క్‌లు పెట్టారు. అంతేనా భగవంతుని విగ్రహాన్ని ముట్టుకోకుడదు అని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన యూపీలోని వారణాసిలో గల విశ్వనాథ్‌ ఆలయంలో జరిగింది. కరోనాపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే దేవాలంయంలోని దేవుడి విగ్రహానికి మాస్క్‌ కట్టినట్లు పూజరి వివరించారు.

దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాపించింది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికే విశ్వనాథ్ స్వామి విగ్రహానికి మాస్క్ పెట్టామని వెల్లడించారు. రాత్రి వేళ్లల్లో వస్త్రాన్ని చూడమాని, వాతావరణం వేడిగా ఉన్న సమయంలో మాస్క్‌ను ఉంచుతామని ఆలయ పూజరి తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు చేతులలో విగ్రహాన్ని తాకడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. దేవుడి విగ్రహాన్ని చేతితో తాకితే కరోనావైరస్‌ ఇతర భక్తులకు సోకే అవకాశం ఉందని, కొద్దీ రోజులు పాటు స్వామివారిని తాకరాదు అని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories