Patna: బీహార్‌లోని పాట్నా బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత

Patna: పాట్నా పోలీసులతో వార్డు కార్యదర్శుల వాగ్వాదం, తోపులాట.. ఆందోళనకారులపై వాటర్ కెనాన్స్ ప్రయోగించిన పాట్నా పోలీసులు

Sandeep Eggoju
Published on: 27 Dec 2021 5:50 PM IST
Extreme tension near Patna BJP office in Bihar | National News Today
X

బీహార్‌లోని పాట్నా బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత

Patna: ఆందోళనలు, నిరసనలతో బీహార్‌లోని పాట్నా రణరంగాన్ని తలపిస్తోంది. పాట్నాలోని బీజేపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున పంచాయతీ వార్డు కార్యదర్శులు చేరుకుని ఆందోళన నిర్వహించారు. గత నాలుగేళ్లుగా ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా వార్డు కార్యదర్శులుగా పనిచేసిన తమను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నెలకు నాలుగు వేల రూపాయల వేతనం ప్రకటించి, ఇప్పుడు జీతం ఇవ్వకుండానే తమను తొలగించారని నినాదాలు చేశారు. ఒక్కసారిగా వేలాది మంది ఆందోళన నిర్వహించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకూ ఆందోళన కారులు వెనక్కు తగ్గకపోవడంతో వాటర్ కెనాన్స్‌ ప్రయోగించారు. వేలాదిగా తరలి వచ్చిన ఆందోళనకారులతో పాట్నా వీధులు నిండిపోయాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story