మిగ్-21 విమానంపై బీఎస్ ధనోవా ఆసక్తికర వ్యాఖ్యలు

మిగ్-21 విమానంపై బీఎస్ ధనోవా ఆసక్తికర వ్యాఖ్యలు
x
Ex air chief Bs Dhanoa , Abhinandan varthaman
Highlights

భారత వాయుసేన మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పాకిస్థాన్ పై అభినందన్ వాడిన యుద్ధ విమానంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు...

భారత వాయుసేన మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పాకిస్థాన్ పై అభినందన్ వాడిన యుద్ధ విమానంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడుల అనంతరం పాకిస్థాన్‌పై అభినందన్ వర్థమాన్ మిగ్-21పై వెళ్లి దాడి చేయడంతో.. పాక్ ఎఫ్-16 దాటికి మిగ్ -21 కూలిపోయి వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మాట్లాడుతూ.. అభినందన్ వాడిన మిగ్ -21 విమానం కూలిపోయింది. ఆ విమానం స్థానంలో రాఫెల్ యుద్ధ విమానంలో అభినందన్ వెళ్లి దాడి చేసినట్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఎఫ్-16 కంటే శక్తిమంతమైన రాఫెల్ యుద్ధ విమానం భారత్ వద్ద ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పారు. భారత అమ్ములపొదిలో రాఫెల్ యుద్ద విమానం చేరడం మంచి పరిణామం అన్నారు. రాఫెల్ పై వివాదం చెలరేగిన సుప్రీం కోర్టు మంచి తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. బాలాకోట్ దాడుల అనంతరం భారత్ చేతిలో రాఫేల్ లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దీనికి ప్రధానంగా కొన్ని రాజకీయ పార్టీలు కూడా కారణమని పరోక్షంగా కారణమని పేర్కొన్నారు. ఎఫ్-16 ఏ యుద్ధ విమానాన్ని కొనాలన్నది నిర్ణయించడానికి 10 సంవత్సరాల సమయం తీసుకున్నారంటూ గతంలోనే అధికార పార్టీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌ దేశంలోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమాని దళం జరిపిన సంగతి తెలిసిందే. మిరాజ్ యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లను బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అభినందన్ మిగ్-21 విమానం నడిపారు. పఠాన్‌కోట్ నుంచి జరిపిన దాడుల్లో ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కూడా ఉన్నారు. అభినందన్‌ దైర్యసాహసాలకు గాను కేంద్రం వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories