Assam: బిజెపి ఎమ్మెల్యే కారులో ఈవీఎం

Evm Found in Bjp MLAs Car After Second Phase Eelection in Assam
x

 అస్సాం:(ఫైల్ ఇమేజ్)

Highlights

Assam: అసోం బిజెపి ఎమ్మెల్స్యే కారులో ఈవీఎం కనపించడం పై దుమారం రేగుతోంది.

Assam: ఈవీఎం యంత్రాల మీద తరచూ అనుమానాలు. అధికారులతో కలిసి ప్రభుత్వం కుట్ర పన్నింది.. ఓ గుర్తుకు ఓటేసినా అధికార పార్టీ అభ్యర్థులకే ఓట్లు పడ్డాయి.. ఎన్నికల అనంతరం తరచూ వినిపించే ఆరోపణలివి. నేతలతో పాటు ఓటర్లు కూడా వీటిపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్ల కిందట జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీటి పనితీరుపై పలు రాజకీయ పార్టీలు అపనమ్మకాన్ని వ్యక్తం చేశాయి. అనంతరం జరిగిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సందేహాలను వెలుబుచ్చాయి.

బిజెపి ఎమ్మెల్యే కారులో ఈవీఎం...

ఈ నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్యే కారులో ఈవీఎం కనపించడం పై దుమారం రేగుతోంది. అసోంలో రెండో దశ ఎన్నికల ముగిసిన తర్వాత ఓ ఈవీఎం ఏకంగా ఎమ్మెల్యే కారులో కనిపించింది. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ఆ బూత్ పరిధిలో రీపోలింగ్‌కు ఆదేశించింది. అసోంలోని రతాబరి నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలింగ్ ముగిసిన తర్వాత...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రతాబరి నియోజకర్గ పరిధిలోని ఇందరి ఎంవీ స్కూల్‌లో పోలింగ్ జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు తీసుకొని ఎన్నికల సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌కు బయలుదేరారు. ఐతే ఎన్నికల సంఘం కేటాయించిన వాహనంలో కాకుండా బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంను తరలించడాన్ని స్థానికులు గమించారు. కరీంగంజ్ ప్రాంతంలో ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు.

వాహనం బ్రేక్ డౌన్ కావడంతో...

ఐతే ఇందులో తమ తప్పూ ఏం లేదని వారు వాపోతున్నారు. పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్‌కు వస్తున్న క్రమంలో మార్గమధ్యలో తమ వాహనం బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డుపై నిలబడ్డామని చెప్పారు. నెట్‌వర్క్ సమస్య కారణంగా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయలేకపోయామని వివరించారు. అదే సమయంలో మహింద్రా బొలెరో వాహనం రావడం లిప్ట్ అడిగామని.. వారు కారు ఆపడంతో ఈవీఎం తీసుకొని స్ట్రాంగ్‌రూమ్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఐతే ఆ కారు ఎవరిదన్న విషయం తమకు తెలియదని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న తర్వాతే అది బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన కారుగా తెలిసిందని అన్నారు.

ఎమ్మెల్యే అనుచరుడి పేరుమీద కారు...

పతార్‌కంది ఎమ్మెల్యే క్రిష్ణేందు పాల్‌కు సంబంధించిన కారులో ఈవీఎంను తరలించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అది ఎమ్మెల్యే అనుచరుడి పేరుమీద రిజస్టర్ అయి ఉంది. ఈ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేస్తున్నారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ ఎన్నికలు మార్చి 27న, రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న ముగిశాయి. ఏప్రిల్ 6న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఫలితాలతో పాటే మే 2న బెంగాల్, అసోం ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటిస్తారు.


Show Full Article
Print Article
Next Story
More Stories