ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

Encounter at Odisha-Chhattisgarh border
x

ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి 

Highlights

Encounter: మరో జవాన్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Encounter: చత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనలో ఓ CRPF జవాన్ మృతి చెందగా.. మరో జవాన్‌కు తీవ్ర గాయాలు కాగా.. హాస్పిటల్ తరలించారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతాబలగాలకు సునాబేడ అటవి ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువైపులా కాల్పులు ప్రారంభించడంతో.. ఒడిశా సుప్పాడ జిల్లా స్పెషల్ ఆపరేషన్ గ్రూపుకు చెందిన ప్రకాష్ సాయి అనే మరొక జవాన్‌కు బుల్లెట్ గాయమైంది. బుల్లెట్ అతని మెడలో ఇరుక్కుపోయింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాయపడిన జవాన్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ ఇరువర్గాల నుంచి అక్కడ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories