ఉద్యోగానికి ఎవరు వచ్చినా హెల్మెట్ ధరించాలి ... ఎందుకో తెలుసా ?

ఉద్యోగానికి ఎవరు వచ్చినా హెల్మెట్ ధరించాలి ... ఎందుకో తెలుసా ?
x
Highlights

వాహనదారులు రక్షణ కోసం వాహనాలు నడిపేటప్పుడు తలకు హెల్మెట్ ధరించాలని నిబంధనలు ఉల్లంఘించకుడదని ప్రతిసారి ప్రభుత్వాలు, పోలీలులు మొత్తుకుంటున్నారు. అయితే వాహనదారులు కొందరు నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు.

వాహనదారులు రక్షణ కోసం వాహనాలు నడిపేటప్పుడు తలకు హెల్మెట్ ధరించాలని, నిబంధనలు ఉల్లంఘించకూడదని ప్రతిసారి ప్రభుత్వాలు, పోలీసులు మొత్తుకుంటున్నారు. అయితే వాహనదారులు కొందరు నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వాహనదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వాహనం నడిపేటప్పుడే కాకుండా ఆఫీస్‌ పనిదినాల్లోకూడా హెల్మెట్లు ధరిస్తున్నారు. వారంతా ధరించేది మోటారు వాహన చట్టనానికి భయపడి మాత్రం కాదు.. మరి ఎందుకనుకుంటున్నారా..? యూపీలో బాందా జిల్లాలోని విద్యుత్‌ శాఖకు చెందిన ఓ కార్యాలయంలో శిథిలావస్థకు చేరింది. దీంతో పై కప్పు ఎప్పుడు ఊడి తలపైన పడుతుందో తెలియని పరిస్థితి. వర్షం పడినా నీరు కారుతోంది. ఈ అంశంపై అనేక సార్లు వారు ఉన్నతాధికారులకు విన్నవించిన పట్టించుకోలేదు. దీంతో గత్యంతరంలేక ఉద్యోగులంతా కలిసి ఈ మార్గం ఎంచుకున్నారు. ఆఫీసులో హెల్మెట్లు ధరించి పనిచేస్తున్నారు.

ఇదే అంశంపై ఓ ఉద్యోగి స్పంధించారు. మా ప్రాణాలు రక్షించుకోవడానికి గత్యంతరం లేక హెల్మెట్‌తో కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు. కీలక డ్యాకుమెంట్లు భద్రపరుచుకునేందుకు అల్మరాలు లేవు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఉద్యోగులు తలకు హెల్మెట్లు ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పడు వైరల్ గా మరింది. చూద్దాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories