Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జన్సీని మరో నెల రోజులు పొడిగింపు

Emergency in Sri Lanka Extended for Another Month
x

Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జన్సీని మరో నెల రోజులు పొడిగింపు

Highlights

Sri Lanka Crisis: ప్రజాగ్రహంతో సింగపూర్ పారిపోయిన గొటబయ రాజపక్స

Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఎమర్జన్సీని మరో నెల రోజుల పాటు పొడిగించింది విక్రమ్ సంఘే ప్రభుత్వం. అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమెదం తెలిపింది. ప్రజా భద్రత, నిరాటకంగా నిత్యావసరాల సరఫరా వంటి అంశాలను చూపుతూ జులై 18న దేశంలో ఎమర్జన్సీ విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రణిల్ విక్రమ్ సింఘే. ఆ ఆర్డినెన్స్ కు 14 రోజుల్లోగా పార్లమెంట్ ఆమెదం తెలపకపోతే అది రద్దవుతుంది.

కానీ తాజాగా పార్లమెంట్ ఆమెదముద్ర వేసింది. దీంతో మరో నెల రోజుల పాటు దేశంలో అత్యవసర స్థితి అమల్లో ఉండనుంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రజాగ్రహంతో దేశం విడిచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స మరో 14 రోజుల పాటు ఆశ్రయాన్ని పొడిగించింది అక్కడి ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories