ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారత ఎంబసీ మూసివేత.. 26 విమానాల్లో...

Embassy of India Closed at Kyiv Shifted to Lviv City in Ukraine | Russia Ukraine War
x

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారత ఎంబసీ మూసివేత.. 26 విమానాల్లో...

Highlights

Ukraine - Embassy of India: ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం లీవ్‌లో భారత ఎంబసీ ఏర్పాటు...

Ukraine - Embassy of India: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారత ఎంబసీని మూసివేశారు. అక్కడి నుంచి ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం లీవ్‌లో భారత ఎంబసీని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి విద్యార్థుల తరలింపు ప్రక్రియ పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. భారతీయులందరూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను విడిచిపెట్టారని తెలిపింది కేంద్రం. ఖార్కివ్ నుండి భారతీయుల తరలింపు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత అని.. ఉక్రెయిన్‌లో ఉన్న 20వేల మందిలో 12వేల మందిని ఇప్పటికే తరలించామని చెప్పింది కేంద్రం.

ఇక రానున్న మూడ్రోజుల్లో 26 విమానాలు నడపాలని నిర్ణయించామని.. రేపు ఉదయం 4 గంటలకు రొమేనియాకు IAF C-17 విమానం బయల్దేరనుంది. రానున్న మూడ్రోజుల్లో బుకారెస్ట్, ఇతర ప్రాంతాల నుంచి భారతీయులను తీసుకురావడానికి 26 విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయని చెప్పింది కేంద్రం. భారతీయులను తరలిచేందుకుం పోలాండ్, స్లోవాక్‌ ఎయిర్‌పోర్టులు ఉపయోగిస్తామంది కేంద్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories