Bengal Elections 2021: అసోం, బెంగాల్ లో కొనసాగుతున్న కౌటింగ్

Bengal Elections 2021: Election Counting Continues In Assam and Bengal | Assembly Elections 2021
x

బెంగాల్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు


Highlights

Bengal Elections 2021: బెంగాల్ లో హోరా హోరీ కొనసాగుతూ వుండగా, అస్సోంలో ఎన్డీయే తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.

Bengal Election 2021: 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాల ముందస్తు ట్రెండ్ మెల్లగా వెల్లడవుతోంది . ఆదివారం లెక్కింపు కేంద్రాల్లో హడావుడి. ఇక ఉదయం 9.30 గంటల సమయానికి బెంగాల్ లో సీఎం, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం.. అస్సాంలో 6 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దాని మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్ 2 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

టీఎంసీ-బీజేపీ మధ్య హోరాహోరీ...

పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. అధికార పార్టీ తృణముల్‌కు, భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరి పోరు నడిచింది. టీఎంసీకి, బీజేపీ చెక్ పెడుతుందా..? లేక మళ్లీ టీఎంసీనే పాగా వేస్తుందా అనేది హాట్ టాపిక్‌గా మారింది. తొలి రౌండ్ నుంచే మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించగా.. టీఎంసీ ప్రస్తుతం 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 54 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

అస్సాంలో ఆధిక్యంలో ఎన్టీయే...

అస్సాంలో ఎన్డీయే 29, యూపీఏ 14 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. సీఎం సర్బానంద సోనోవాల్.. ముందంజలో కొనసాగుతున్నారు. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీంతోపాటు అస్సాంలో బీజేపీ మళ్లీ విజయం సాధించి నిలుస్తుందా.. లేక కాంగ్రెస్ ధీటైన పార్టీగా పుంజుకుంటుందా అనేది కూడా తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories