బీహార్ లో మోగనున్న ఎన్నికల నగారా : కాసేపట్లో షెడ్యూల్!

బీహార్ లో మోగనున్న ఎన్నికల నగారా : కాసేపట్లో షెడ్యూల్!
x
Highlights

బీహార్ లో మోగనున్న ఎన్నికల నగారా : కాసేపట్లో షెడ్యూల్! బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే విలేకరుల సమావేశంలో బీహార్ అసెంబ్లీ..

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే విలేకరుల సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) ప్రకటించనుంది. ఎన్నికలు అక్టోబర్ చివరివారంలో జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ -19 మార్గదర్శకాలు మరియు సామాజిక దూర నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు జరుపనుంది ఈసీ.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో బీహార్ లో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. పొత్తుల్లో సీట్ల లెక్కలేసుకుంటున్నాయి. ఇప్పటికే జేడీయూ, బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి జీతం రాయ్ మాంజీ పార్టీలకు పొత్తు ఖరారైంది.. అయితే సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు కూడా కుదిరింది. రెండు మూడు రోజులలో సీట్ల పంపకాలపై స్పష్టత రానుంది. మరోసారి తామే అధికారంలోకి వస్తామని జేడీయూ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈసారి మార్పు ఖాయమంటోంది ఆర్జేడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories