Assembly Election Results: ర్యాలీలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్‌

Assembly Election  Results: Election Commission Serious On Victory Rallies
x

విజయోత్సవ ర్యాలీలపై ఈసీ సీరియస్

Highlights

Assembly Elections: నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

Assembly Election Results: దేశ వాప్తంగా నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఇదివరకే కొన్ని రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గెలిచిన పార్టీలు సంబురాలు చేసుకోవద్దు అని, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని అన్ని పార్టీలను హెచ్చరించింది.

కాగా, నిషేధం ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపడుతున్నారని, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు జరిగిన చోట కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. అలాగే ర్యాలీలు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేయాలని, దీంతో పాటు సంబంధిత ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేయాలని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories