Punjab: పంజాబ్ సీఎం కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు

ED Raids Punjab CM Charanjit Singh Channi Relative | National News Online
x

పంజాబ్ సీఎం కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు

Highlights

Punjab: అక్రమ ఇసుక తవ్వకాల కుంభకోణానికి సంబంధించి.. దాడులు చేసినట్లు వెల్లడించిన అధికార వర్గాలు

Punjab: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ కుటుంబసభ్యుల ఇళ్ళపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. దాదాపు 10 నుండి 12 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులుచేశారు. అక్రమ ఇసుక తవ్వకాల కుంభకోణానికి సంబంధించి దాడులు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉత్తరప్రదశ్‌లో‌నూ ఐటీ శాఖ దాడులు చేసింది. సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్నిహుతులపై దాడులు చేశారు ఐటీ అధికారులు. రానున్న రోజుల్లో ఈడీ, సీబీఐ లు కూడా దాడులకు వస్తాయని అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories