అసెంబ్లీలో బల పరీక్షకు ముందు బిగ్ షాక్.. ఆర్జేడీ నేతల పై ఈడీ దాడులు

ED Raids on Houses of RJD Leaders in Bihar
x

అసెంబ్లీలో బల పరీక్షకు ముందు బిగ్ షాక్.. ఆర్జేడీ నేతల పై ఈడీ దాడులు

Highlights

CBI Raids: ఎమ్మెల్సీ సునీల్‌సింగ్‌ ఇంట్లో ఈడీ తనిఖీలు

CBI Raids: బిహార్‌లో ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. పట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి తనిఖీలు చేశారని.... మళ్లీ చేయడంలో అర్థం లేదన్నారు ఆర్జేడీ నేతలు. భయభ్రాంతులను సృష్టించి ఎమ్మెల్యేలను వారికి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారన్నారు.ఇదే కుంభకోణానికి సంబంధించి ఆర్జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్ఫాక్‌ కరీం ఇంటిపై కూడా సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ దాడులపై ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా స్పందిస్తూ ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు.. బీజేపీ దాడులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories