తమిళనాడులో ఈడీ రైడ్స్‌.. విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇంటిపై దాడులు

ED Raids Education Minister Ponmudis House
x

తమిళనాడులో ఈడీ రైడ్స్‌.. విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇంటిపై దాడులు

Highlights

ED Raids: పొన్ముడి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ జరుగుతున్న సోదాలు

ED Raids: తమిళనాడులో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు.. తాజాగా మంత్రి పొన్ముడి ఆయన కుమారుడి ఇళ్లపై ఈ ఉదయం దాడులు చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన పొన్ముడిపై మనీ లాండరింగ్‌ ఆరోపణలు నేపథ్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పొన్ముడి ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. మొత్తం 9 చోట్ల ఈడీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.

2007 నుంచి 2011 వరకు పొన్ముడి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో గనుల లైసెన్స్‌లకు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయన తనయుడు గౌతమ్‌ సహ నిందితుడిగా ఉన్నాడు. అవినీతి ఆరోపణల కేసులో ఊరట కోసం పొన్ముడి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణపై స్టే విధించాలని కోరారు. అయితే కోర్టులో ఆయనకు ఉపశమనం దక్కలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories