ఢిల్లీ తోపాటు ఈ ప్రాంతాల్లో స్వల్ప భూకంపం

ఢిల్లీ తోపాటు ఈ ప్రాంతాల్లో స్వల్ప భూకంపం
x
Highlights

ప్రస్థుతం కరోనా కట్టడిపై లాక్ డౌన్ కొనసాగుతోన్న వేళా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. దీనికి కారణం అక్కడ స్వల్ప భూకంపం సంభవించింది.

ప్రస్థుతం కరోనా కట్టడిపై లాక్ డౌన్ కొనసాగుతోన్న వేళా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. దీనికి కారణం అక్కడ స్వల్ప భూకంపం సంభవించింది. ఇది రిక్టర్‌ స్కేల్‌పై ఇది 3.5గా నమోదైంది. భూప్రకంపనలతో ఇళ్లలో ఉన్న జనం భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

కాగా ఈ స్వల్ప భూకంప ఢిల్లీలోని వజీరీబాద్‌లో 8 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ(ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ఎక్కడెక్కడ ప్రభావం చూపించిందో అని సర్వే చేశారు అధికారులు..

ఈ క్రమంలో ఢిల్లీ తోపాటు నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లోనూ భూప్రకంపనలు సంభవించినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు. ఇక ఇలాంటి స్వల్ప భూకంపాలు రావడం సర్వ సాధారణమే అని.. పెద్దగా నష్టమేమి ఉండదని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత్ లో పలు ప్రాంతాల్లో ఇలాంటి భూకంపాలు సంభవించాయి. ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం నష్టం గాని ఆస్తినష్టం గాని జరగలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories