Earthquake: హర్యానాలోని ఫరీదాబాద్‌లో 3.2 తీవ్రతతో భూకంపం

Earthquake
x

Earthquake: హర్యానాలోని ఫరీదాబాద్‌లో 3.2 తీవ్రతతో భూకంపం

Highlights

Earthquake Faridabad: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం సంభవించిన భూకంపం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 22న తెల్లవారుజామున 6:08 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి.

Earthquake: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం సంభవించిన భూకంపం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 22న తెల్లవారుజామున 6:08 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది.

భూకంప కేంద్రం భూమి లోపల సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘర్షణల శబ్దం, ఊగిసలాటల కారణంగా ప్రజలు నిద్రలేచి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున అనూహ్యంగా భూమి కంపించడంతో పలువురు ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.

ఇటివలి కాలంలో మళ్లీ భూకంపాల ఆందోళన

దేశంలో గత కొన్ని రోజులుగా చిన్నపాటి భూకంపాలు తరచుగా నమోదవుతున్నాయి. దీంతో భూకంప సంభవించే ప్రాంతాల్లో ప్రజలలో భయం నెలకొంది. అయితే, ఫరీదాబాద్‌లో సంభవించిన ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగిందన్న సమాచారం ఇప్పటి వరకు లేదు.

స్థానిక అధికార యంత్రాంగం పరిణామాలను పరిశీలిస్తూ, భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఎదురు చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories