Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు..పరుగులు తీసిన జనం

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది.

Kranthi
Published on: 1 Jun 2021 5:52 AM IST
Earthquake in Delhi
X

Earthquake in Delhi:(File Image)

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.దాంతో అక్కడి ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే భూకంప తీవ్రత తగ్గువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూమి అనేక పొరలుగా విభజించబడింది. భూమి క్రింద అనేక రకాల ప్లేట్లు ఉన్నాయి. అయితే కలిసి ఉన్న ప్లేట్లు భూమి లోపలి ఉష్ణోగ్రతల ఆధారంగా ఆ ప్లేట్లు అటూ ఇటూ కదులుతుంటాయి. ఫలితంగా భూకంపం సంభవిస్తుంటుంది. అయితే, ఇటీవలి కాలంలో దేశంలో తరచూ భూమి కంపిస్తూనే ఉంది.

Kranthi

Kranthi

Next Story