గుజరాత్ లో భూకంపం.. పరుగులు తీసిన జనాలు

గుజరాత్ లో భూకంపం.. పరుగులు తీసిన జనాలు
x
Highlights

ఒక పక్క కరోనా విలయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా, తాజాగా భూకంపం వచ్చి గుజరాత్ ప్రజల్ని పరుగులు తీయించింది.

ఒక పక్క కరోనా విలయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా, తాజాగా భూకంపం వచ్చి గుజరాత్ ప్రజల్ని పరుగులు తీయించింది. గతంలో మాదిరిగానే నాలుగైదు జిల్లాల్లో వచ్చిన ప్రకంపనల వల్ల ఆందోళనలు చెందిన ప్రజలు ఎటువంటి నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

గుజరాత్ లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రాజ్‌కోట్, కచ్, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రాజ్‌కోట్ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయువ్యంగా రాత్రి 8.13 గంటల ప్రాంతంలో భూమి కంపించిన‌ట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 5.8గా భూకంప తీవ్రత నమోదైంది. కాగా, భూ ప్రకంపనల స‌మయంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురై… ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. భూ ప్ర‌క‌పంన‌ల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగలేద‌ని తెలుస్తోంది. దీనిపై వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వం అల‌ర్ట‌యింది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజ్ కోట్, కచ్, పఠాన్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడి..ప‌రిస్థితిని సమీక్షించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories