మందుబాబులు కోసం మహారాష్ట్ర సర్కార్ వినూత్న విధానం!

మందుబాబులు కోసం మహారాష్ట్ర సర్కార్ వినూత్న విధానం!
x
Representational Image
Highlights

మందుబాబులుకోసం మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది..

మందుబాబులుకోసం మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు నిబంధనలను పాటించకుండా భారీగా గుమికూడుతుండటం, మరోపక్కా రాష్ట్రంలో కరోనా వీరవిజృంభణ చేస్తుండటంతో మహారాష్ట్ర సర్కార్ ఓ కొత్త విధానానికి నాంది పలికింది.

ఆదివారం నుంచి టోకెన్ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. అంటే మద్యం కొనుగోలు చేసుకోవాలని అనుకునే వారు ముందుగా ఎక్సైజ్ విభాగం పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే టోకెన్ వస్తుంది.. ఆ టోకెన్ తీసుకొని మద్యం షాపుకి వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట.. అయితే ఈ-టోకెన్ విధానం కోసం పుణే, నాసిక్ ప్రాంతాల్లోని హోల్‌సేలర్స్ అసోసియేషన్ యాప్‌ను డెవలప్ చేసింది.

ముందుగా మధ్యం కొనుగోలు చేసుకోవాలి అనుకునే వారు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వచ్చే టైం స్లాట్ ఆధారంగా సమీపంలోని లిక్కర్ షాపుకెళ్లి మద్యం కొనుగోలు చేయొచ్చు. ఈ విధానం వల్ల టోకెన్ పొందిన వారు తమకు కేటాయించిన టైంలోనే మద్యం కొనుగోలు చేస్తారు. తద్వారా వైన్స్ వద్ద భారీ క్యూలు తగ్గుతాయి. కరోనా కట్టడి చేసినట్టు కూడా అవుతుంది. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మహారాష్ట్రలో మొత్తం ప్రవేశపెట్టనున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories