ఆన్ లైన్ లో వీటిని మాత్రమే కొనుగోలు చెయ్యాలి : కేంద్ర హోమ్ శాఖ

ఆన్ లైన్ లో వీటిని మాత్రమే కొనుగోలు చెయ్యాలి : కేంద్ర హోమ్ శాఖ
x
Highlights

మొదటి లాక్డౌన్ వ్యవధిలో ఇ-కామర్స్ కంపెనీల నుంచి అన్ని వస్తువుల సేల్స్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

మొదటి లాక్డౌన్ వ్యవధిలో ఇ-కామర్స్ కంపెనీల నుంచి అన్ని వస్తువుల సేల్స్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.అయితే ఏప్రిల్ 20 న ఆన్ లైన్ షాపింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. దాంతో అన్ని essential , non-essential సేల్ ఉంటుందని ప్రజలతోపాటు పలు కంపెనీలు కూడా భావించాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్డౌన్ 2.0 వ్యవధిలో ఇ-కామర్స్ కంపెనీల నుంచి వచ్చే అనవసరమైన వస్తువుల (non-essential) సేల్ ను నిషేధించినట్టు పేర్కొంది.

ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 20 నుంచి మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ మరియు ఇతర వినియోగదారుల వస్తువులతో సహా అనవసరమైన వస్తువులను సేల్ చేయడానికి ఇ-కామర్స్ సంస్థలకు అనుమతి ఉన్నట్లు ప్రచారం జరిగిన తరువాత ఈ స్పష్టత వచ్చింది. దీని ప్రకారం కేవలం లాక్డౌన్ ముగిసే వరకు ఇ-కామర్స్ కంపెనీలకు ఆహారం, ఔషదాలు, వైద్య పరికరాలు వంటి అవసరమైన వస్తువులను మాత్రమే సేల్ చేయడానికి అనుమతి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories