చిన్నారికి అత్యవసర చికిత్స.. కారును ఓవర్ టేక్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి

An Inhuman Incident In Bangalore
x

బెంగళూరులో అమానవీయ ఘటన

Highlights

కారును ఓవర్ టేక్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి

Bengaluru: కారును ఓవర్ టేక్ చేసినందుకు అంబులెన్స్ డ్రైవర్‌పై ఓ వక్తి దాడికి పాల్పడిన అమానవీయ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు- తుమకూరు జాతీయ రహదారిపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న 5 నెలల బాలుడిని చికిత్స అందించేందుకు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్సు డ్రైవర్ కారును ఓవర్ టేక్ చేశాడు. అది నచ్చని కారులో వ్యక్తులు అంబులెన్స్‌ను సుమారు 5 కిలోమీటర్ల ఛేజ్ చేసి, అంబులెన్స్ డ్రైవర్‌ను కాలర్ పట్టుకుని బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 5 నెలల బాలుడి తల్లిదండ్రులు వదిలేయండని బతిమిలాడినా వారు వినలేదు. చివరకు పోలీసుల జోక్యంతో అంబులెన్స్‌ను విడిచిపెట్టారు.

మరోవైపు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ సంఘటనను తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్‌పై దాడి చేసిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో వారు మద్యం సేవించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories