గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన మహిళల విద్య:ఏసీఈఆర్ రిపోర్ట్

Drop in unschooled mothers from 47 percent to 29 in 8 years ASER 2024 Report
x

గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన మహిళల విద్య:ఏసీఈఆర్ రిపోర్ట్

Highlights

గ్రామీణ ప్రాంతాల్లోని తల్లుల్లో చదువుకున్నవారి సంఖ్య పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లోని తల్లుల్లో చదువుకున్నవారి సంఖ్య పెరిగింది. జనవరిలో విడుదలైన ఏఎస్ఈఆర్ నివేదిక వెల్లడించింది. ఎప్పుడూ స్కూల్ కు హాజరుకాని తల్లుల నిష్పత్తి తగ్గింది. 2016లో ఎప్పుడూ స్కూల్ కు హాజరుకాని తల్లులు 46. 6 శాతం ఉంటే 2024 నాటికి ఈ సంఖ్య 29.4 శాతానికి పడిపోయింది. 2001-02లో ప్రారంభమైన సర్వశిక్ష అభియాన్‌తో ఈ ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

ప్రాథమిక విద్యాభ్యాసమే కాదు, టెన్త్ చదువుకున్న తల్లుల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. 2016లో టెన్త్ చదివిన తల్లుల సంఖ్య 9.2 శాతం. అయితే 2024 నాటికి ఈ సంఖ్య 19.5 శాతానికి పెరిగింది. కేరళలో ఈ సంఖ్య అధికంగా ఉంది. 2016లోటెన్త్ చదువుకున్న తల్లుల సంఖ్య 40 శాతం ఉంది. 2024 నాటికి ఇది 69.6 శాతానికి పెరిగింది.

కేరళ తర్వాతి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఎనిమిదేళ్లలో ఈ సంఖ్య 22 శాతం పెరిగింది. 2016లో ఇక్కడ 30.17 మంది తల్లులు టెన్త్ చదువుకున్నారు. 2024 నాటికి ఈ సంఖ్య 52.4కు చేరింది.చదువుకున్న తల్లుల విషయంలో మధ్యప్రదేశ్ లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 2016లో 9.7 శాతం ఉంది ఉంటే, 2024 నాటికి ఇది 3.6 శాతం మాత్రమే పెరిగింది.టెన్త్ చదివిన తండ్రుల శాతం పెరుగుదల కూడా తక్కువే. 2016లో 17.4% నుండి 2024లో 25%కి పెరిగింది. దేశంలోని 605 గ్రామీణప్రాంతాల్లోని స్కూల్స్ లో ఈ సర్వే నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories