Delhi: ఇండియా గేట్ వద్ద ఆకట్టుకున్న 'నేజాతీ' డ్రోన్ షో

Drone Show of Netaji at India Gate
x

Delhi: ఇండియా గేట్ వద్ద ఆకట్టుకున్న 'నేజాతీ' డ్రోన్ షో

Highlights

Delhi: సుభాష్ చంద్రబోస్ జీవితం, వారసత్వాన్ని ప్రతిబింబించేలా..

Delhi: ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద కేంద్ర సాంస్కృతికశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రోన్ షో ఆకట్టుకుంది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితం, వారసత్వాన్ని ప్రతిబింబించేలా 250 డ్రోన్లతో నిర్వహించిన ఈ డ్రోన్ లేజర్ షోను జనం ఆసక్తిగా వీక్షించారు. దశలవారీగా రివ్వున ఆకాశంలోకి ఎగిరిన ఈ డ్రోన్లు లేజర్‌ వెలుగుల్ని విరజిమ్ముతూ నేతాజీ చిత్రంగా ఏర్పడటం కనులవిందు చేసింది. శుక్రవారం రాత్రి 8గంటల 35 నిమిషాలకు మొదలైన ఈ షో దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఈ అపురూప క్షణాల్ని తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు జనం.

Show Full Article
Print Article
Next Story
More Stories