అమ్మాయిలకు గేర్ రాడ్ ఇచ్చి.. బస్సు నడుపుతూ టిక్‌టాక్ చేసిన డ్రైవర్

అమ్మాయిలకు గేర్ రాడ్ ఇచ్చి.. బస్సు నడుపుతూ టిక్‌టాక్ చేసిన డ్రైవర్
x
Image: Facebook/ Open Newser Wayanad News
Highlights

టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. టిక్‌టాక్ కొందరిని స్టార్లను కూడా చేసింది టిక్‌టాక్. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది టిక్‌టాక్...

టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. టిక్‌టాక్ కొందరిని స్టార్లను కూడా చేసింది టిక్‌టాక్. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది టిక్‌టాక్ చేస్తున్నారు. అయితే టిక్‌టాక్ పిచ్చితో ప్రయాణికుల ప్రాణాలతోనే చెలగాటం ఆడాడు ఓ బస్సు డ్రైవర్. కేరళాకు చెందిన ఓ బస్సు డ్రైవర్ ఇద్దరు అమ్మాయిలతో కలిసి గేర్లు వేయిస్తూ బస్సు నడుపుతూ టిట్‌టాక్ చేశాడు.

కేరళ నుంచి గోవాకు విద్యార్థులతో కలిసి ప్రయాణిస్తున్న బస్సులో టిక్‌టాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విద్యార్ధులకు గేర్ రాడ్ ఇచ్చి డ్రైవర్ ఎం.షాజీ బస్సు నడుపుతున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో అతడి లైసెన్సు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories