DRDO: భవిషత్తులో లేజర్ వార్స్.. డీఆర్డీవో ప్రణాళికలు

DRDO: భవిషత్తులో లేజర్ వార్స్.. డీఆర్డీవో ప్రణాళికలు
x
Highlights

DRDO | ఆధునిక సాంకేతికను అందుకుని ముందుకు వెళ్లకపో్తే వెనకబడి పోవడమే. అందుకే అందివస్తున్న అవకాశాలను భారత్ వినియోగించుకుంటుంది.

DRDO | ఆధునిక సాంకేతికను అందుకుని ముందుకు వెళ్లకపోతే వెనకబడి పోవడమే. అందుకే అందివస్తున్న అవకాశాలను భారత్ వినియోగించుకుంటుంది. భవిషత్తులో లేజర్ కిరణాలతో సింక్షిప్తమయ్యే ఆయుధాలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి డీఆర్డీవో ప్రణాళికలు చేస్తోందని తెలుస్తోంది.

భవిష్యత్తులో స్టార్‌ వార్స్‌ సినిమాలోని సీన్లను తలపించేలా యుద్ధాలు జరిగే అవకాశాలున్నాయా? ఒకవేళ అదే పరిస్థితి వస్తే.. ఎదుర్కొనేందుకు భారత్‌ ఇప్పటినుంచే సిద్ధమవుతోందా? అందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రణాళికలు రచిస్తోందా? ఈ ప్రశ్నలకు రక్షణ రంగ పరిశీలకులు ఔననే సమాధానమే చెబుతున్నారు.

శత్రువుల గగనతలం నుంచి దూసుకొచ్చే డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు మొదలుకొని భూతలం మీదుగా వచ్చే సైనిక వాహనాలు, ట్రక్కుల దాకా అన్నింటి వైపు కాంతివేగంతో దూసుకెళ్లి, కచ్చితత్వంతో ఛేదించగల డైరెక్టెడ్‌ ఎనర్జీ ఆయుధాల (డీఈడబ్ల్యూ) అభివృద్ధి కార్యక్రమంపై డీఆర్‌డీఓ దృష్టిసారించింది. ఇందులో భాగంగా కెమికల్‌ ఆక్సిజన్‌ అయోడిన్‌, హై పవర్‌ ఫైబర్‌ రకాల లేజర్లతో పాటు రహస్య లేజర్‌తో నడిచే 'కాళీ' వంటి ఆయుధాల తయారీకి కసరత్తు చేస్తోంది. వచ్చే పదేళ్లలో సైన్యానికి అవసరమైనన్ని హై ఎనర్జీ లేజర్లు, హై పవర్డ్‌ మైక్రోవేవ్‌లతో కూడిన ఆయుధాల అభివృద్ధికి సన్నాహాలు మొదలుపెట్టింది.

ఇందుకోసం దేశంలోని ఇతర సంస్థలతో కలిసి పనిచేసేందుకూ డీఆర్‌డీఓ సిద్ధమవుతోంది. ఆ సంస్థ ఇప్పటికే రెండు రకాల లేజర్‌ ఆయుధాలను అభివృద్ధిచేసింది. వాటిలో మొదటిది ట్రక్కులాంటి వాహనంపై అమర్చేది. ఇది పది కిలోవాట్ల లేజర్‌ శక్తితో రెండు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇక రెండోది కెమెరా ట్రైపాడ్‌ లాంటి పరికరానికి బిగించేది.

ఇది రెండు కిలోవాట్ల లేజర్‌ శక్తితో ఒక కిలోమీటరు దూరంలోని లక్ష్యాలను చేరుకోగలదు. ఈ రెండింటి పనితీరును ఇప్పటికే ప్రత్యేక ప్రదర్శనల ద్వారా రక్షణ, పోలీసు, నిఘా వర్గాలకు వివరించారు. శత్రుదేశాల డ్రోన్లలోని కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థల అనుసంధానాన్ని తెంపేసి, వాటిలోని ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల పనితీరును నిలువరించే సామర్థ్యం లేజర్‌ ఆయుధాలకు ఉంటుంది.

కొన్నేళ్ల క్రితమే అమెరికా 33 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన లేజర్‌ ఆయుధాలను పరీక్షించగా.. భారత్‌ సైతం 100 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన వాటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకుసాగుతోంది. వచ్చే పదేళ్లలో దేశ సైన్యానికి ఇరవై చొప్పున 'ట్యాక్టికల్‌ హై ఎనర్జీ లేజర్‌', 'హైపవర్‌ ఎలకో్ట్ర మేగ్నటిక్‌' ఆయుధాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. తొలిదశలో 8 కిలోమీటర్లలోపు లక్ష్యాలను.. రెండోదశలో 15 కిలోమీటర్లు పైబడిన లక్ష్యాలను ఛేదించగల లేజర్‌, మైక్రోవేవ్‌ ఆయుధాలను అభివృద్ధిచేయాలని డీఆర్‌డీఓ యోచిస్తోంది.

ఇక క్రూయిజ్‌ క్షిపణులను గాల్లోనే కూల్చివేయాలంటే.. కనీసం 500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన లేజర్‌ ఆయుధాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ తరహా ఆయుధం మరో ఐదేళ్లలో అమెరికా చేతికి రావచ్చని అంటున్నారు. మిస్సైళ్ల కంటే చౌకగా లేజర్‌ ఆయుధాల తయారీకి అవకాశాలు ఉండటంతో భవిష్యత్తులో వాటి దిశగా అన్ని దేశాలు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. భవిష్యత్తులో యుద్ధానికి మారుపేరుగా స్టార్‌వార్సే నిలుస్తాయేమో!!

Show Full Article
Print Article
Next Story
More Stories