DRDO 2DG Medicine: 2డీజీ వినియోగంలో జాగ్రత్త: డీఆర్డీవో

DRDO Issued Guidelines for Anti Covid 19 2DG Medicine
x

డీఆర్డీవో 2 డీజీ (2 డీఆక్సీ డీ గ్లూకోజ్) (ఫొటో ట్విట్టర్)

Highlights

DRDO 2DG Medicine: దేశంలో కరోనా కట్టడిలో భాగంగా పలు టీకాలు అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి.

DRDO 2DG Medicine: దేశంలో కరోనా కట్టడిలో భాగంగా పలు టీకాలు అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే కొవిడ్ చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు డీఆర్డీవో 2 డీజీ (2 డీఆక్సీ డీ గ్లూకోజ్) ఔషధాన్ని తయారు చేసింది. ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విధితమే. కొవిడ్ రోగులకు ఈ ఔషధ వినియోగించేప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఈమేరకు 2డీజీ వాడకంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.

కొవిడ్ చికిత్సలో భాగంగా 2డీజీ ఔషధాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదని, డాక్టర్ల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని వెల్లడించింది. ఓ మోస్తరు కరోనా లక్షణాల నుంచి తీవ్రంగా ఉన్నవారికి దీన్ని వాడొచ్చని పేర్కొంది. ప్రస్తుత చికిత్సకు అనుబంధంగానే దీన్ని ఉపయోగించాలని తెలిపింది. గరిష్ఠంగా 10 రోజుల లోపు 2డీజీ వాడకాన్ని డాక్టర్లు సూచించాలని తెలిపింది.

ఇతర జబ్బులు ఉన్న పేషంట్లకు ‎2డీజీ ఔషధం వినియోగించే ముందు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. డయాబెటిస్, తీవ్రస్థాయి గుండెజబ్బులు, లివర్, కిడ్నీ వ్యాధులు, తీవ్ర శ్వాసకోశ సమస్యలున్నవారిపై 2డీజీని పరీక్షించలేదని పేర్కొంది. అలాగే 18 ఏళ్ల లోపు వారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులకు ఈ మందు వాడొద్దని డీఆర్డీవో ఆదేశాలు జారీ చేసింది. 2డీజీ ఔషధం కోసం [email protected]కి వివరాలను మెయిల్ చేయాలని కోరింది.


Show Full Article
Print Article
Next Story
More Stories