DRDO: చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో

DRDO Developed Chaff Technology to Defend Against Enemy Radar Range
x

చాఫ్ టెక్నాలజీ (ఫోటో: ది హిందూ)

Highlights

* శత్రు రాడార్ పరిధి నుంచి రక్షించుకునేందుకు చాఫ్ టెక్నాలజీ *చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్-118/ఐను అభివృద్ధి చేసింది

DRDO: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు శత్రు రాడార్‌ పరిధి నుంచి రక్షించుకొనేందుకు చాఫ్‌ టెక్నాలజీని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. జోధ్‌పూర్‌లోని డీఆర్‌డీఓ డిఫెన్స్‌ ల్యాబొరేటరీ, పుణేలోని డీఆర్‌డీఓ ప్రయోగశాలలు సంయుక్తంగా ఐఏఎఫ్‌ అవసరాలకు అనుగుణంగా అధునాతన చాఫ్‌ మెటీరియల్, చాఫ్‌ క్యాట్రిడ్జ్‌–118/ఐను అభివృద్ధి చేసింది. శత్రువులు ప్రయోగించే రాడార్‌ నిర్దేశిత మిస్సైల్స్‌ను ఇది తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా వాయుసేన విమానాలకు ముప్పు తప్పుతుంది.

చాఫ్‌ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్‌ నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత అని రక్షణశాఖ తెలిపింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతల్లో ఆత్మ నిర్భర్‌ భారత్ దిశగా డీఆర్‌డీఓ మరొక అడుగు ముందుకేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి సహకరించిన రక్షణ శాఖ ఆర్‌ అండ్‌ డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి బృందాలను రాజ్‌నాథ్‌ అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories