'కోవిడ్ వ్యాక్సిన్' ఫేజ్-3 ట్రయల్స్ కు అనుమతి ఇవ్వండి : డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్

కోవిడ్ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్ కు అనుమతి ఇవ్వండి : డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్
x
Highlights

భారత్ లో కరోనావైరస్ కట్టడికోసం ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-V తో భాగస్వామిగా ఉన్న రెడ్డీస్..

భారత్ లో కరోనావైరస్ కట్టడికోసం ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-V తో భాగస్వామిగా ఉన్న రెడ్డీస్.. ఈ వ్యాక్సిన్ మూడో దశ మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించాల్సిందిగా శుక్రవారం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) కు దరఖాస్తు చేసింది. స్పుత్నిక్-V యొక్క క్లినికల్ ట్రయల్స్ మరియు దాని పంపిణీని నిర్వహించడానికి రెడ్డీస్ దిగ్గజం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) తో కలిసి పనిచేస్తోంది. కాగా కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ఆమోదం పొందిన తరువాత, 100 మిలియన్ మోతాదును డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ ఆధ్వర్యంలో RDIF సరఫరా చేస్తుందని సదరు సంస్థ తెలిపింది.

మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-V ఫేజ్-3 ట్రయల్స్ సెప్టెంబర్ 1 నుండి రష్యాలో దాదాపు 40,000 విషయాలపై జరుగుతోంది. రష్యాలోని గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ మరియు ఆర్డిఐఎఫ్ స్పుత్నిక్ వి సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను రూపొందించాయి. ఇదిలావుంటే భారతదేశంలో ప్రస్తుతం ఐసిఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ , జైడస్ కాడిలా లిమిటెడ్ అను రెండు సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం రెండవ దశలో ఉన్నాయని పిటిఐ నివేదించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories