UP: ఘోర ప్రమాదం.. డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..5 మంది ప్రయాణికులు సజీవ దహనం

Double-decker bus catches fire on Kisan route several passengers burnt alive
x

UP: ఘోర ప్రమాదం.. డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..5 మంది ప్రయాణికులు సజీవ దహనం

Highlights

UP: ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ కొత్వాలి ప్రాంతంలోని కిసాన్ పాత్‌లో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ...

UP: ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ కొత్వాలి ప్రాంతంలోని కిసాన్ పాత్‌లో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ బస్సు బీహార్‌లోని పాట్నా నుండి కార్మికులు , వారి కుటుంబాలను తీసుకొని ఢిల్లీకి వెళుతోంది. గురువారం ఉదయం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు, ప్రయాణికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

అరడజనుకు పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశాయి. మంటలు చాలా భయంకరంగా ఉండటంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటలు వేగంగా అంటుకోవడంతో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories