తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ దంపతులు

తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ దంపతులు
x
తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ దంపతులు
Highlights

తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ దంపతులు

భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అహ్మదాబాద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ సందర్శించారు. ఆయన వెంట భార్య మెలానియాతో కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ అల్లుడు కూడా ఉన్నారు. తాజ్ అందాలను చూసి ట్రంప్ దంపతులు మంత్రముగ్థులైయ్యారు.

అంతకుముందు అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి మోతెరా స్టేడియం వరకు దారిపొడవునా... ప్రజలు ట్రంప్ కోసం బారులు తీరారు. ఆగ్రా ఎయిర్ పోర్టులో ట్రంప్‌ను ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్ సంప్రదాయం, సంస్కృతికి అద్దంపడేలా వాయిద్యాలు, నృత్యాలతో కళాకారులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటిని ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ఎంతో ఆసక్తిగా తిలకించారు.

విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్‌కు బయలుదేరిన ట్రంప్‌నకు 25 వేల మంది విద్యార్థులు 13 కిలోమీటర్ల పొడవునా భారత్, అమెరికా జాతీయ జెండాలను చేతపట్టుకుని ట్రంప్‌కు స్వాగతం పలికారు. మరోవైపు, ట్రంప్ పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories