70 ఏళ్లలోనే భారత్‌ శక్తిగా ఎదిగింది

70 ఏళ్లలోనే భారత్‌ శక్తిగా ఎదిగింది
x
Donald Trump
Highlights

మోతెరా స్టేడియంలో భారత ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మాట్లాడారు. ముందుగా నమస్తే.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

మోతెరా స్టేడియంలో భారత ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ మాట్లాడారు. ముందుగా నమస్తే.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశాభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నరని ట్రంప్ అన్నారు. మోతెరాలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌కు రావడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. భారత ప్రధాని మోదీ తనకు నిజమైన మిత్రుడని అన్నారు. ఈ సందర్భంగా మోదీకి అభినందనలు తెలిపారు. 5 నెలల క్రితం పెద్ద ఫుట్‌బాల్‌ మైదానంలో మోదీకి స్వాగతం పలికామని ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో తనకు స్వాగతం ట్రంప్ వెల్లడించారు.

భారత్‌ ఒక ఈ 70ఏళ్లలోనే శక్తిగా ఎదిగిందని, ప్రపంచానికి భారత్‌ ఎదుగుదల ఒక మార్గదర్శకం అని ట్రంప్ అన్నారు. ' మోదీ ఒక ఛాయ్‌వాలాగా జీవితం మొదలుపెట్టిన ఈ స్థాయికి చేరుకున్నారని అభినందించారు. శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనే దానికి మోదీనే నిదర్శనమని తెలిపారు. భారత్‌లో రోడ్లు, ఇంటర్నెట్ అనుసంధానం గతం కంటే ఎన్నో రెట్లు మెరుగయ్యాయి. పారిశుద్ధ్యం, పేదరిక నిర్మూలనలో భారత్ అద్భుత పురోగతి సాధించిందన్నారు.

అంతకుముందు మోతెరా స్టేడియంలో 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్‌ -అమెరికా మైత్రి బంధం చిరకాలం వర్థిల్లాలని ఆకాంక్షించారు. మోతెరా స్టేడియం ఈ నూతన చరిత్రకు వేదికగా నిలుస్తోందని అన్నారు. ట్రంప్‌కు గుజరాత్‌ ఒక్కటే కాదు, యావద్దేశం స్వాగతం పలుకుతోందని హ్యూస్టన్‌లో హౌడీ మోదీ, కార్యక్రమానికి కొనసాగింపుగానే 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమం నిర్వహించినట్టు అన్నారు. ట్రంప్‌కు మనస్ఫూర్తిగా భారత్ మనస్పూర్తిగా స్వాగతం పలుకుతోందన్నారు. ఇరు దేశాల స్నేహ బంధంలో సరికొత్త అధ్యాయం మొదలైంద ప్రధాని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories