ఇవాంక ట్రంప్ ఆసక్తికర ట్వీట్.. హైదరాబాద్..

ఇవాంక ట్రంప్ ఆసక్తికర ట్వీట్.. హైదరాబాద్..
x
Highlights

భారత పర్యటనకు బయలుదేరేముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

భారత పర్యటనకు బయలుదేరేముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ట్రంప్ కంటే ముందే ఆమె రెండేళ్ల కిందటే భారత్ పర్యటనకు వచ్చారు.. ఈ సందర్బంగా తన తాజాగా ట్వీట్‌లో హైదరాబాద్‌ను గుర్తు చేసుకున్నారు.. అందులో 'రెండేళ్ల క్రితం హైదరాబాదులో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్నా. ఆ తర్వాత మళ్లీ మోదీని కలుస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య స్నేహాన్ని వేడుక చేసుకోడానికి ఇండియాకు తిరిగి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఆమె ట్వీట్ వైరల్ గా మారింది.

కాగా 2017 లో హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్‌ ప్రెన్యుయర్ సమ్మిట్‌ జరిగిన సంగతి తెలిసిందే.. ఈ సమ్మిట్ లో ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ కు ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు.

ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు చేరుకున్నారు.. ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అయింది. దీంతో తొలిసారి భారత్ గడ్డపై ట్రంప్ కాలు మోపారు. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా విమానంలో కుటుంబంతో సహా వచ్చిన ట్రంప్ నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్బంగా ట్రంప్ ను ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు మరియు భారత ప్రభుత్వనికి చెందిన ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఆయన కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది. ఎయిర్‌పోర్టు లో ఏర్పాటు చేసిన నృత్య కళకారుల బృందాలు ట్రంప్‌ బృందానికి స్వాగతం పలికాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories