Breast Cancer: పెరుగుతున్న కేన్సర్.. ఆహారపు అలవాట్లేనంటున్న వైద్యులు

Breast Cancer: పెరుగుతున్న కేన్సర్.. ఆహారపు అలవాట్లేనంటున్న వైద్యులు
x

బ్రెచ్ కాన్సర్ 

Highlights

Breast Cancer: పదిహేనేళ్లు, ఇరవై ఏళ్ల క్రితం చూసుకుంటే కేన్సర్ రోగులు ఎక్కడో ఉండేవారు... చాలావరకు తెలిసేది కాదు.. క్రమేపీ అది విస్తరిస్తోంది... మన ఆహారపు అలవాట్లు వల్ల ఇది మరింత వ్యాప్తి చెందుతోంది.

Breast Cancer: పదిహేనేళ్లు, ఇరవై ఏళ్ల క్రితం చూసుకుంటే కేన్సర్ రోగులు ఎక్కడో ఉండేవారు... చాలావరకు తెలిసేది కాదు.. క్రమేపీ అది విస్తరిస్తోంది... మన ఆహారపు అలవాట్లు వల్ల ఇది మరింత వ్యాప్తి చెందుతోంది. ప్రధానంగా ఈ వ్యాధి సోకినా ప్రమాద స్థాయికి చేరేవరకు తెలుసుకోలేకపోవడంతో అధిక శాతం మరణాలు సంభవిస్తున్నాయి. భవిషత్తులో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని నేషనల్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ రిపోర్ట్‌ 2020 హెచ్చరించింది.

కేన్సర్‌ పడగ విప్పుతోంది. జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పట్టణీకరణ కేన్సర్‌కు దోహదం చేస్తున్నాయి. 25 నుంచి 35 ఏళ్ల వయసులోనే కేన్సర్‌ రావడానికి ఈ అలవాట్లే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మన దేశంలో కేన్సర్‌ బాధితుల సంఖ్య 2025 నాటికి 15.6 లక్షలకు చేరుకుంటుందని నేషనల్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ రిపోర్ట్‌ 2020 హెచ్చరించింది. ఈ నివేదికను ఐసీఎంఆర్‌ విడుదల చేసింది. 2010లో దేశంలో ఆరులక్షల మంది కేన్సర్‌ బాధితులు ఉండగా, 2015 నాటికి అది 9 లక్షలు, 2020 నాటికి 13.9 లక్షలకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. తెలంగాణలో కేన్సర్‌ బారిన పడిన వారి సంఖ్య రెండేళ్లుగా దాదాపు రెండు నుంచి మూడు శాతం పెరిగినట్లు వైద్యులు తెలిపారు.

ఈ సంఖ్య మరో అయిదేళ్లలో రెట్టింపు అయ్యే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రొమ్ము కేన్సర్లు బాగా పెరుగుతున్నాయి. ఏడాది, రెండేళ్ల నుంచి వీటి సంఖ్య గణనీయంగా ఉంటోంది. మహిళ్లలో రొమ్ము కేన్సర్లు పది నుంచి పదిహేను శాతానికి పెరిగినట్లు అంకాలజిస్టులు చెబుతున్నారు. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి వచ్చే బాధితుల్లో రొమ్ము కేన్సర్లు మొదటి స్థానంలో ఉంటున్నాయి. ఎంఎన్‌జే ఆస్పత్రికి ఏడాదికి నాలుగు వేల వరకు ఈ కేసులు వస్తుండగా, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి దాదాపు మూడు వేల వరకు ఉంటున్నాయి.

గర్భాశయ ముఖ కేన్సర్లు తగ్గుముఖం

ఒకనొక దశలో గర్భాశయ ముఖ కేన్సర్లు విజృంభించాయి. చాలా మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఒకప్పుడు 20 శాతం వరకు ఉన్న గర్భాశయ కేన్సర్లు ఇప్పుడు 5 శాతానికి తగ్గినట్లు డాక్టర్లు తెలిపారు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంకా గర్భాశయ ముఖ కేన్సర్‌తో వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత తెలిపారు.

నోటి కేన్సర్లలో పెరుగుదల

పొగాకు ఉత్పత్తులతో నొటి కేన్సర్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. అదేవిధంగా జీర్ణకోశ కేన్సర్లు సైతం పెరుగుతున్నాయని అంకాలజిస్టులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితంతో పోల్చితే వీటి సంఖ్య 20 శాతం పెరిగిందని అపోలో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి చెప్పారు. కేన్సర్‌ బాధితుల్లో 65 శాతం వరకు జీవన శైలి, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల వల్లనే ఈ వ్యాధి బారిన పడుతున్నారని డాక్టర్లు అంటున్నారు. పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్‌ సేవించడం, ధూమపానం, కేన్సర్‌ పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేన్సర్‌ బాధితులు వస్తుంటారు. ఈ ఆస్పత్రికి ఏటా కొత్తగా పన్నెండు వేల మంది చికిత్స కోసం వస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories