Dr Manmohan Singh: విద్యావేత్తగా తన కెరీర్ ప్రారంభించిన మన్మోహన్ సింగ్.. ప్రధాని ఎలా అయ్యారో తెలుసా?

Dr Manmohan Singh: విద్యావేత్తగా తన కెరీర్ ప్రారంభించిన మన్మోహన్ సింగ్..  ప్రధాని ఎలా అయ్యారో తెలుసా?
x
Highlights

Dr Manmohan Singh: 2004 మే22 నుంచి 2024 మే 26 వరకు భారత 14 ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. తన కెరీర్ విద్యావేత్తగా ప్రారంభించిన మన్మోహన్...

Dr Manmohan Singh: 2004 మే22 నుంచి 2024 మే 26 వరకు భారత 14 ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. తన కెరీర్ విద్యావేత్తగా ప్రారంభించిన మన్మోహన్ సింగ్ 1971లో వాణిజ్య మంత్రిత్వశాఖలో ఆర్థిక సలహాదారునిగా చేరారు. ఆ తరవ్ాత అనేక కీలక పదవులను నిర్వహించారు. ముఖ్య ఆర్ధిక సలహాదారుగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి, ఆర్బిఐ గవర్నర్ గా ఉన్నారు. అయితే ఆర్బిఐ గవర్నర్ గా ఉన్న సమయంలో మన్మోహన్ కు రాజకీయాలు పరిచయం చేసింది పీవీ నరసింహారావు. 1991లో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేశారు పీవీ. ఆ తర్వాత మన్మోమన్ సింగ్ తిరుగులేని అగ్రనేతగా ఎదిగి ప్రధానిగా దేశానికి సేవలను అందించారు.

1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్..దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ కార్యక్రమాలను చేపట్టారు. ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు దేశం ఆర్థిక లోటు, చెల్లింపుల లోటు, విదేశీ మారక రిజర్వులు తగ్గిపోవడం వంటి కష్టాలను ఎదుర్కొంటోంది. అయితే పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రైవెటైజేషన్, ఎగుమతి ఆయాతి నియమాల సులభతరం వంటి అనేక సంస్థరణలు ఆయన చేపట్టారు. దీంతో మధ్యతరగతికి ఎక్కువ డిస్పోజబుల్ ఆదాయం అందించింది. వ్యాపారాన్ని సులభంగా నిర్వహించగలిగే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి భయటపడింది.

ఈ ప్రాముఖ్యత చూసి సోనియా గాంధీ 2004లో ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేశారు. చిత్తుశుద్ధిగా కానీ స్థిరమైన నాయకత్వంతో మన్మోహన్ సింగ్ జియోపాలిటిక్స్ లోదారిని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 2014లో భారత ప్రధాని పదవిని వీడారు. ఆ సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆయనకు ప్రశంసలు అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories