ఛపాక్ సినిమాను చూస్తా.. దీపికా పదుకొనేకు మద్దతుగా కనిమొళి


దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలంలో కొందరు దుండగులు ముసుగులు ధరించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దాడి ఘటనపై పెద్ద ఎత్తున నిరసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దుండగుల దాడిలో గాయపడిని వారిని తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి పరామర్శించారు. బుధవారం జేఎన్‌యూ ప్రాంగణానికి వెళ్లి అక్కడ విద్యార్థులను కలిశారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో కనిమొళి మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలు ఆయిషీ ఘోష్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సంద్భంగా కనిమొళి మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు. మంగవారం బాలీవుడ్ నటి దీపికా పదుకునే బాధితులు పరామర్శించారు. ఈ నేపథ్యంలో దీపిక పదుకొనేను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కనిమొని స్పందించారు. దీపికా పదుకొనేను నెటిజన్లు ట్రోలింగ్ చేయడం తప్పుబట్టారు .దీపికా సినిమాలు చూడొద్దని నెటిజన్లు పిలుపునివ్వడం సరైంది కాదన్నారు. ఇప్పటి వరకు తాను హిందీ సినిమాలు చూడలేదని, దీపిక మద్దతుగా ఆమె నటించిన హీందీ చిత్రం ఛపాక్ చూస్తానని స్పష్టం చేశారు.
కాగా, మంగళవారం జేఎన్‌యూకు వెళ్లిన దీపీక పదుకొనే దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఈ క్రమంలో నెటిజన్లు దీపిక పదుకొనేను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఛపాక్‌ను చూడొద్దని పిలునిచ్చారు. సినిమా ప్రచారం కోసం దీపీకా పదుకొనే దిగజారిపోతున్నారని విమర్శలు కురిపిస్తున్నారు. మరి కొందరు దీపికా పదుకొనేను ప్రసంశిస్తున్నారు.
దీనిపై పలువురు ప్రముఖులు స్పంధించారు. ఈ ఘటనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తక్షణమే వర్సిటీ శాంతియుత వాతావరణం తెచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.దాడుల్లో ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన చెందారు. విద్యార్థుల గొంతునొక్కే చర్యలుగా ఆయన అభివర్ణించారు.మరోవైపు ఈ దాడికి తామే కారణం హిందూ రక్షాదళ్ సంచలన ప్రకటన చేసింది. హిందూ రక్షాదళ్ అధ్యక్షుడు భూపేంద్ర తోమర్ అలియాన్ పింకీ చౌధ సోషల్‌మీడియాలో ఓ విడుదల ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో భూపేంద్ర తోమర్ అలియాన్ పింకీ చౌధ జేఎన్‌యూ కమ్యూనిస్టులకు హబ్‌గా మారిందిని, వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భవిష‌్యత్తులో మరే యూనివర్సిటీలో ఇలాంటివి సహించబోమని, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసిన ఇలాంటి ఘటనలో రిపీట్ అవుతాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



