కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక
x
Highlights

-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక -ఐదు శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం -ఈ ఏడాది జూలై నుంచి అమలులోకి రానున్న పెరిగిన డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త అందించింది. దీపావళి కానుకగా ఐదు శాతం డీఏ పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు చెల్లిస్తున్న 12 శాతం డీఏను 17 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి 16 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని మంత్రి జవదేకర్ వెల్లడించారు. పెంచిన డీఏనూ ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. 50 లక్షలమంది ఉద్యోగులకు, 62 లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories