ఇంటర్నెట్ లేకున్నా రూ.200 వరకు డిజిటల్ చెల్లింపులు.. RBI కొత్త నిబంధనలు ఏంటంటే..?

ఇంటర్నెట్ లేకున్నా రూ.200 వరకు డిజిటల్ చెల్లింపులు.. RBI కొత్త నిబంధనలు ఏంటంటే..?
ఆర్బీఐ ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం సరికొత్త నిబంధనలను రూపొందించింది.
Without Internet: ఆర్బీఐ ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం సరికొత్త నిబంధనలను రూపొందించింది. ఒక వ్యక్తి ఇప్పుడు ఇంటర్‌నెట్ లేకున్నా కూడా గరిష్టంగా రూ. 200 వరకు ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు. అయితే ఈ చెల్లింపుల ముఖాముఖి మాత్రమే జరుగుతుంది. వాస్తవానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌లైన్ చెల్లింపు విధానంలో అనేక మార్పులు చేస్తోంది. సెప్టెంబర్ 2020 నుంచి జూలై 2021 వరకు అమలు చేయబడిన కొన్ని ఆర్థిక పనులలో దీని పైలట్ పరీక్షగా అమలు చేశారు. గత ఏడాది ఆగస్టు 6న రిజర్వ్ బ్యాంక్ దీనికి సంబంధించిన పైలట్ స్కీమ్‌ను ఆమోదించింది. ఆఫ్‌లైన్ లేదా ఇంటర్నెట్ లేకుండా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీల కోసం వీటిని రూపొందించింది.
దీని ఆధారంగా డిజిటల్ ఆఫ్‌లైన్ (ఇంటర్నెట్ లేకుండా) రూ. 200 వరకు చెల్లింపు చేయవచ్చు. దీని కోసం లావాదేవీలు చేసే వ్యక్తులు దగ్గర దగ్గర లేక ముఖాముఖిగా ఉన్నప్పుడు మాత్రమే రూ.200 ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీ జరుగుతుంది. ఏదైనా మెషీన్‌కు కస్టమర్ అనుమతి ఇస్తేనే ఆఫ్‌లైన్ చెల్లింపు జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఆఫ్‌లైన్ చెల్లింపు కోసం కస్టమర్ కార్డ్‌లు, మొబైల్ వాలెట్‌లు లేదా మొబైల్ పరికరాల వంటి విభిన్న మాధ్యమాలను ఉపయోగించవచ్చు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు, డేటా లభ్యత ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయి.
2019లో భారత జనాభాలో కేవలం 41 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యధిక జనాభాకు ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితిలో ఆ ప్రాంతాలలో ఆన్‌లైన్ లేదా ఇంటర్నెట్ నుంచి చెల్లింపు లావాదేవీల సౌకర్యాన్ని అందించడం చాలా కష్టమని తేలింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్‌బిఐ చాలా కాలం క్రితం ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు ప్రారంభించింది. దీని కోసం ఫీచర్ ఫోన్‌ల నుంచి చెల్లింపు నియమాలను తయారు చేస్తున్నారు. ఇవి ఈ సంవత్సరం మార్కెట్‌లోకి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టవచ్చు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT