క్రూయిజ్ షిప్‌లో మరో భారతీయ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్

క్రూయిజ్ షిప్‌లో మరో భారతీయ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్
x
Highlights

జపాన్‌లో నిర్బంధంలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో మరో భారతీయ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో...

జపాన్‌లో నిర్బంధంలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో మరో భారతీయ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో భారతీయ సిబ్బంది కరోనావైరస్ (COVID-19) పాజిటివ్ అని తేలింది.. ఈ మేరకు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధృవీకరించింది. దీనితో భారతీయ పౌరుల సంఖ్య ఇప్పుడు 7కు చేరుకున్నట్టయింది.

ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. "డైమండ్ ప్రిన్సెస్ షిప్ లో కొత్తగా 88 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఐసోలేషన్ లో భారతీయులు చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. ఫిబ్రవరి 21 వరకు నిర్బంధ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది అని రాయబార కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది. క్రూయిజ్ షిప్‌లో కొత్త కేసులు కనుగొనడంతో, ఓడలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 621 కు చేరుకుందని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో జపాన్ తీరానికి చేరుకున్న క్రూయిజ్ షిప్‌లో ఉన్న 3,711 మందిలో 132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులతో సహా మొత్తం 138 మంది భారతీయులు ఉన్నారు.

భారత రాయబార కార్యాలయం ఇంతకుముందు ఓడలో ఉన్న భారతీయ పౌరులందరికీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. ఈ మేరకు వారికోసం ఒక ఇమెయిల్ పంపింది. జపాన్ ప్రభుత్వ ఆరోగ్యం మరియు దిగ్బంధం ప్రోటోకాల్‌లను అనుసరించాలని అభ్యర్ధించింది. జనవరి 25 న హాంకాంగ్‌లో దిగిన ఒక ప్రయాణీకుడు కరోనావైరస్ బారిన పడినట్లు గుర్తించిన తరువాత ఓడ నిర్బంధించ బడింది, కరోనావైరస్ కోసం గరిష్టంగా 14 రోజుల ఐసోలేషన్ వ్యవధిని పరిగణనలోకి తీసుకొని, జపాన్ ప్రభుత్వం క్రూయిజ్ షిప్‌ను నిర్బంధించింది రెండు వారాల నుంచి యోకోహామా వద్ద షిప్ కు లంగర్ వేశారు.

ఇదిలావుంటే క్రూయిజ్ షిప్‌లో చిక్కుకున్న భారతీయ యువతీ సోనాలి ఠక్కర్ కు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తనకు సహాయం కావాలని ఆమె ప్రధాని నరేంద్ర మోదీని అర్ధించారు. ఆమె 14 రోజులుగా అక్కడే చిక్కుకుపోయింది. ఆమెకు కరోనా వైరస్ పరీక్షలు చేసినా నెగిటివ్ అని వచ్చింది. దాంతో ఆమె కరోనావైరస్ బారిన పడలేదని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తనను భారత్ కు రప్పించేలా సహాయం చెయ్యాలని కోరుతున్నారామె.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories