దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు 17 వరకు నిషేధం

దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు 17 వరకు నిషేధం
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగింపునకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలపై నిషేధాన్ని మే 17 వరకు పొడిగించారు.

కరోనావైరస్ వ్యాప్తికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగింపునకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలపై నిషేధాన్ని మే 17 వరకు పొడిగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విదేశీ మరియు దేశీయ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిర్ణీత సమయంలో ప్రారంభించడం గురించి తెలియజేస్తామని చెప్పాయి.

"అంతర్జాతీయ ఆల్-కార్గో కార్యకలాపాలు , DGCA చే ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితి వర్తించదు" అని ఏవియేషన్ నుండి సర్క్యులర్ వచ్చింది. కోవిడ్ -19 మహమ్మారి భారిన పడకుండా సామాజిక దూరం కోసం సిబ్బందికి అవగాహన కల్పించడానికి , వారిని సిద్ధం చేయడానికి విమానయాన సంస్థలు మాక్ కసరత్తులు చేయడం ప్రారంభించాయి.

ఇదిలావుంటే ప్రస్తుత సంక్షోభంలో విమానాలు నడిపే పరిస్థితి కూడా కష్టంగా ఉంది. విమానాలు మళ్లీ తమ విధులను ప్రారంభించాలంటే వెంటనే రూ.19,000 కోట్లు అవసరమని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా తన తాజా నివేదిక లో పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories