మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్
x
Highlights

మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్...

మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాత్రికి రాత్రే పరిణామాలు మారి.. ఎన్సీపీలో చీలిక ఏర్పడినట్టు తెలుస్తోంది. ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్‌ సీఎంగా ప్రమాణం చేయగా.. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వాస్తవానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహారాష్ట్ర వికాస్ అఘాడిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-ఎన్సీపీ అంగీకారం తెలిపాయి. శనివారం మూడు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన చేయనున్నారు..

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు , ఉమ్మడి ప్రణాళిక తదితర అంశాలన్నింటిపైనా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే హఠాత్తుగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయడం సంచలనంగా మారింది. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేందుకు 10 రోజుల సమయం కూడా ఉంది. శుక్రవారం రాత్రే ఎన్సీపీ తో బీజేపీ అధిష్టానం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఎన్సీపీ గనక బీజేపీకి పూర్తిస్థాయిలో మద్దతు పలికితే బీజేపీ, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పాటు కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories