సీఎం పీఠంపై కలత చెందడం లేదు

సీఎం పీఠంపై కలత చెందడం లేదు
x
Highlights

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రాబోతుందని, ఆ పార్టీ నేత సీఎం అవుతారని చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సహా పలువరు నేతలు పదేపదే పేర్కొంటున్నారు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రాబోతుందని, ఆ పార్టీ నేత సీఎం అవుతారని చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సహా పలువరు నేతలు పదేపదే పేర్కొంటున్నారు. ఈ అంశంపై తనకు ఎలాంటి బాధ లేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ, శివసేన కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం సీఎం ఎవరనే దానిపై ఎలాంటి వివాదం లేదని దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అధికారంలోకి వస్తే శివసేన నేతే సారథ్యం వహిస్తారని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. దీనిపై ఫడ్నవీస్‌ వివరణ ఇచ్చారు. అక్టోబర్‌ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు హర్యానా కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 24న ఫలితాలు వెలువడతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories