WHO Concern: ఇండియాలో కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

WHO Concern: ఇండియాలో కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
x
Highlights

WHO Concern: ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు.

WHO Concern: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కరాళనృత్యం చేస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు తమకు తోచిన విధంగా సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈనేపధ్యంలో ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ దేశానికి తాము చేయగలిగిన సాయమంతా చేస్తామని ఆయన చెప్పారు.

ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ దేశానికి తాము చేయగలిగిన సాయమంతా చేస్తామని ఆయన చెప్పారు. అసలు పరిస్థితి ఊహించలేనంతగా ఉందని, ఇతర దేశాలకు లోగడ సాయం చేసిన భారత్ నేడిలా క్రైసిస్ ని ఎదుర్కోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ హాస్పిటల్స్ ను, లేబోరేటరీని ఇండియాకు పంపుతామని టెడ్రోస్ తెలిపారు. పోలియో, టీబీ సహా వివిధ కార్యక్రమాలకు ఉద్దేశించి పని చేస్తున్న 2,600 మంది నిపుణులను భారత్ లో అధికారులకు, వైద్య సిబ్బందికి సాయపడేందుకు పంపుతున్నట్టు ఆయన తెలిపారు. గత 9 వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియాను ఆదుకునేందుకు కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయని, ఇది అభినందించదగినదని పేర్కొన్న ఆయన, మరిన్ని దేశాలు ఈ విషయంలో చొరవ చూపగలవని ఆశిస్తున్నట్టు టెడ్రస్ చెప్పారు.

భారత్ లో ఒక్కరోజే 2,812 మంది కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య సుమారు 2 లక్షలకు చేరుకుంది. సోమవారం రోజే 352,991 కేసులు నమోదయ్యాయి. అటు అమెరికా, బ్రిటన్ దేశాలతోబాటు తాజాగా ఫ్రాన్స్ కూడా ఇండియాకు సాయపడేందుకు ముందుకు వచ్చింది.ఆ దేశం నుంచి అత్యాధునిక ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఇండియాకు చేరనున్నాయి. ఇండియా ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలను ఆదుకోవడం తమ విద్యుక్త ధర్మమని ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఈ సాయమే కాకుండా భవిష్యత్తులో మరింత సహాయం చేస్తామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories