Coronavirus: భారత్‌లో ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా

Coronavirus: భారత్‌లో ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా
x
Highlights

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా సోకడం భయాందోళన కు గురిచేస్తోంది. ఐటి కంపెనీలైన డెల్,...

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా సోకడం భయాందోళన కు గురిచేస్తోంది. ఐటి కంపెనీలైన డెల్, మైండ్‌ట్రీలలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను కరోనావైరస్ కోసం పాజిటివ్‌ పరీక్షలు చేసినట్లు కంపెనీ ప్రకటనలు తెలిపాయి. అమెరికా టెక్సాస్‌ నుంచి వచ్చిన ఒకరికి కరోనా వైరస్‌ సోకింది. మైండ్‌ ట్రీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఆఫీసు పని మీద ఇతర దేశానికి వెళ్లి వచ్చారు. ఈ ఉద్యోగులిద్దరూ భారత్‌కు వచ్చాక వారు కలిసిన సంబంధీకులను నిర్బంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

టెక్సాస్ లో రౌండ్ రాక్ లోని మా ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. యునైటెడ్ స్టేట్స్ నుండి తిరిగి వచ్చిన తరువాత డెల్ ఇండియాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు COVID-19 వైరస్ కోసం పరీక్షించబడ్డారని మేము నిర్ధారించగలము. ఒక ఉద్యోగి నెగిటివ్ రాగా మరొకరు పాజిటివ్ అని తేలింది.. దాంతో వారిని ప్రస్తుతం నిర్బంధం లో ఉంచి చికిత్స అందిస్తున్నారని డెల్ టెక్నాలజీస్ వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వ్యాధుల నియంత్రణ కేంద్రాల నుండి ఆరోగ్య, భద్రతా మార్గదర్శకాలను పాటించడం ద్వారా అలాగే స్థానిక ఆరోగ్య అధికారులతో సమన్వయం చేయడం ద్వారా డెల్ టెక్నాలజీస్ బృందం సభ్యులను రక్షించడానికి చర్యలు కొనసాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తమ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

మరోవైపు విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తన ఉద్యోగుల్లో ఒకరు 2020 మార్చి 10 న COVID-19 కు పాజిటివ్ పరీక్షలు చేశారని మైండ్‌ట్రీ వెల్లడించింది.

ఆ ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో పాటు దిగ్బంధం మరియు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. అతనికి మరియు అతని కుటుంబానికి ఉత్తమమైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత ఉద్యోగి తనను తాను వేరుచేసుకున్నాడు, ఇతర మైండ్‌ట్రీ సహచరులను ఎవరిని కలవలేదు అని కంపెనీ తెలిపింది. కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది.

ఇదిలావుంటే భారత్ లో కరోనా వైరస్‌ సోకినట్టుగా అనుమానిస్తున్న ఒక వృద్ధుడు మరణించారు. ఇటీవల సౌదీ యాత్రకి వెళ్లొచ్చిన 76 ఏళ్ల కర్ణాటక వాసి మహమ్మద్‌ హుస్సేన్‌ సిద్ధిఖీగా గుర్తించారు. అతను అక్కడినుంచి వచ్చిన తరువాత జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో ఈ నెల 5వ తేదీన కలబురిగి జిల్లా మెడికల్‌ కాలేజీకి, తర్వాత 9న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వైరస్‌ లక్షణాలు తగ్గకపోవడంతో అంబులెన్స్‌లో కలబురిగికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories