ఢిల్లీలో మెట్రో రైల్ తిరిగి ప్రారంభం

ఢిల్లీలో మెట్రో రైల్ తిరిగి ప్రారంభం
x
Highlights

రాజధాని ఢిల్లీలో హింస తీవ్రతరం కావడంతో, ముందు జాగ్రత్తగా అన్ని మెట్రో స్టేషన్ల ప్రవేశ మరియు నిష్క్రమణ గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...

రాజధాని ఢిల్లీలో హింస తీవ్రతరం కావడంతో, ముందు జాగ్రత్తగా అన్ని మెట్రో స్టేషన్ల ప్రవేశ మరియు నిష్క్రమణ గేట్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉదయం మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్ని స్టేషన్లలో మెట్రో సాధారణ సేవలు తిరిగి ప్రారంభమైనట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) ఒక ట్వీట్ లో తెలిపింది. అన్ని ప్రాంతాలకు మెట్రో అందుబాటులో ఉందని తెలిపింది. అయితే అన్ని మెట్రో స్టేషన్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

కాగా చంద్ బాగ్, భజన్‌పురా, గోకుల్‌పురి, మౌజ్‌పూర్, కర్దాంపూరి, జాఫ్రాబాద్ వంటి ప్రాంతాలు సిఎఎ అనుకూల మరియు వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. ఇది తీవ్రతరం కావడంతో 13 మంది మృతి చెందారు. వారిలో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అలాగే పోలీసులు సైతం ఆందోళనకారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 48 మంది పోలీసు సిబ్బందితో సహా 200 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో సగం మంది పౌరులు తుపాకీ గాయాలకు గురైనట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories