ఢిల్లీలో అంకిత్ శర్మ మృతి విషయంలో ఆప్ నేతపై అనుమానాలు..

ఢిల్లీలో అంకిత్ శర్మ మృతి విషయంలో ఆప్ నేతపై అనుమానాలు..
x
Highlights

ఢిల్లీ అల్లర్లలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణం విషయంలో ఆప్(ఆమ్ ఆద్మీ) పార్టీ...

ఢిల్లీ అల్లర్లలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణం విషయంలో ఆప్(ఆమ్ ఆద్మీ) పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తాహిర్ మరియు అతని మద్దతుదారులు ఐబి సిబ్బంది అంకిత్ ను చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. చంద్ బాగ్ లోని ఆప్ నాయకుడు, మునిసిపల్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు చెందిన భవనం నుండి కొంతమంది వ్యక్తులు రాళ్ళు రువ్వారని అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అంకిత్ దాడి చేశారని అంకిత్ తండ్రి రవీందర్ కుమార్ పేర్కొన్నారు. అలాగే తాహిర్ ఒక దేశ వ్యతిరేక వ్యక్తి. అతనికి చెందిన భవనం నుండే రాళ్ళు రువ్వారు. ఈ క్రమంలో అంకిత్ పై కత్తితో దాడి చేశారు. అని ఆయన చెప్పారు.

అయితే కౌన్సిలర్ తాహిర్ రాజకీయాల్లో పెద్దగా పేరు తెలియని వ్యక్తి కాకపోవచ్చు.. కాని ఈశాన్య ఢిల్లీలోని షాహదారా, నెహ్రూ నగర్, చాంద్‌బాగ్ ప్రాంతంలో ఆయనకు గట్టి పట్టు ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, అతను కరావాల్ నగర్ లోని నెహ్రూ విహార్ లో నివసిస్తున్నాడు. 2017 లో నియోజకవర్గం 059-ఇ-నెహ్రూ విహార్ (తూర్పు ఢిల్లీ) నుండి ఆప్ టికెట్‌పై కౌన్సిలర్ గా గెలుపొందారు. అలాగే అతను ఒక వ్యాపారవేత్త.. ఎన్నికల సమయంలో 18 కోట్ల ఆస్తులను కూడా ప్రకటించాడు. అతనిపై ఇప్పటివరకూ ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు. అయితే అంకిత్ శర్మ మరణంపై అతని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఖజారి చాంద్ బాగ్ నాలాలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. డెడ్ బాడీలను పరిశీలించగా..మిస్పింగ్ అయిన..ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూర్టీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువకుడు అంకిత్ శర్మగా గుర్తించారు. అంకిత్ శర్మను కత్తులతో దాడి చేసి.. ఈడ్చుకెళ్లి..నాలాలో ఆందోళనకారులు పడేశారు. కళ్లు పీకేసి..గొంతు కోసి దారుణంగా హతమార్చారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారు. దాదాపు 300 మంది దాకా గాయపడ్డారు. ఇందులో 50 మంది దాకా పోలీసులు ఉండటం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories