ఈశాన్య ఢిల్లీలో హింసాకాండ.. 18 కి చేరిన మృతుల సంఖ్య

ఈశాన్య ఢిల్లీలో హింసాకాండ.. 18 కి చేరిన మృతుల సంఖ్య
x
Highlights

ఈశాన్య ఢిల్లీలో మూడు రోజులుగా సిఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళన హింసాకాండగా మారింది. ఈ ఆందోళనలో మరణించిన వారి సంఖ్య 18 కి చేరుకుంది, ఇందులో హెడ్...

ఈశాన్య ఢిల్లీలో మూడు రోజులుగా సిఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళన హింసాకాండగా మారింది. ఈ ఆందోళనలో మరణించిన వారి సంఖ్య 18 కి చేరుకుంది, ఇందులో హెడ్ కానిస్టేబుల్ బుల్లెట్ గాయాలతో మరణించిన సంగతి తెలిసిందే.. మిగిలిన వారిలో పౌరులు ఉన్నారు. అలాగే 45 మంది పోలీసులు సహా మొత్తం 250 మంది గాయపడ్డారు. మంగళవారం ఈశాన్య ఢిల్లీలో 67 కంపెనీలు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. హింసాకాండకు సంబంధించి సుమారు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో షూట్-ఎట్-విజన్ ఆర్డర్లను జారీ చేశారు. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కింద ముస్లిం మహిళలు నేతృత్వంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా.. అధికారులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోనికి తీసుకున్నారు.

కాగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు పైగా, భజన్‌పుర ఆందోళనకారులు దుకాణాలను తగలబెట్టి, రాళ్ళు రువ్వారు, క్రమంగా ముస్లిం ప్రాబల్యం ఉన్న చంద్ బాగ్ ప్రాంతం వైపునకు పాకింది. దీంతో మధ్యాహ్నం వరకు, వారిని వెనక్కి నెట్టడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయితే పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో సాయంత్రం 5.05 గంటలకు అది సాధ్యమైంది. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రూపంలో అదనపు బలగాలు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.

కాగా ఈ రోజు తెల్లవారుజామున 12.30 గంటలకు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అల్లర్లకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. దీనిపై కేంద్ర మంత్రివర్గానికి వివరించడానికి ఆయన సిద్ధమయ్యారు. అలాగే చనిపోయిన మరియు గాయపడిన వారి వివరాలను , అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న వారి సంఖ్యను కేంద్రం ముందు ఉంచుతారు. మరోవైపు పౌరసత్వ చట్టంపై హింసకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలపై.. సుప్రీంకోర్టు బుధవారం కొన్ని పిటిషన్లను విచారించనుంది. ఇదిలావుంటే ఢిల్లీలో ఆందోళనలను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు వైఫల్యం చెందారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం విమర్శించారు. గాయపడిన వారిని సరైన ఆసుపత్రికి తరలించడానికి ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు నిన్న రాత్రి అర్ధరాత్రి విచారణ జరపాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories