ఢిల్లీ-యుపి సరిహద్దులో భారీగా లాక్ అయిన కార్మికులు

ఢిల్లీ-యుపి సరిహద్దులో భారీగా లాక్ అయిన కార్మికులు
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో లాక్డౌన్ పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో లాక్డౌన్ పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ - ఉత్తర ప్రదేశ్ సరిహద్దు మీదుగా సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు భారీగా ఈ బోర్డర్ వద్దకు తరలివచ్చారు. ట్రాన్స్ పోర్ట్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు కాలినడకన, సరిహద్దును దాటి వారి గమ్యస్థానాలకు వెళుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నారు. అయితే ఘజియాబాద్‌లోని లాల్కువాన్ నుంచి బస్సులు తిరుగుతాయని కార్మికులకు ముందుగా సమాచారం అందడంతో వారంతా బయలుదేరారు..

తీరా బస్సులు తిరగక పోవడంతో కాలినడకనే బయలుదేరారు.. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు యుపి సరిహద్దు వద్ద భారీగా జనం గుమిగూడారు. భారీ జనాన్ని చూసిన స్పీ, ఎడిఎం అక్కడికక్కడే సరిహద్దులో ఉన్న ప్రజలను నిలిపివేశారు. దీంతో కార్మికులకు ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక అక్కడే ఉండి పోయారు. ఎండకు ఎండుతూ వర్షంలో తడిసిపోతూనే ఉన్నారు.. వారిని తరలించడానికి ఏ అధికారి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories