ఢిల్లీలో ఉగ్రదాడుల జరగొచ్చు.. నిఘా వర్గాల హెచ్చరిక

ఢిల్లీలో ఉగ్రదాడుల జరగొచ్చు.. నిఘా వర్గాల హెచ్చరిక
x
Delhi Police (File Photo)
Highlights

కరోనా మహమ్మారి నియంత్రణ లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారి నియంత్రణ లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ సందర్భంగా శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థ(ఐసిస్‌) దాడులకు కుట్రలు పన్నుతుందని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఢిల్లీలోని పోలీస్ అధికారులపై పెద్ద ఎత్తున దాడులు జరిపేందకు ఐసిస్‌ కుట్ర చేస్తున్నట్టుగా నిఘా వర్గాలకు సమాచాం అందింది. అలాగే ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉగ్రమూకలు పెద్ద వాహనంతోగాని, తొక్కిసలాట రూపంలోగానీ, కాల్పులు జరపడం ద్వారా లేదా, పోలీసు పికెట్‌పైకి దూసుకురావడం ద్వారా గానీ ముష్కరులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణలో నిమగ్నమయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories