Delhi Police head constable shoots himself: గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్య‌హ‌త్య‌

Delhi Police head constable shoots himself: గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్య‌హ‌త్య‌
x
Delhi Police head constable shoots himself
Highlights

Delhi Police head constable shoots himself: నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి విపరీతమైన ఒత్తిడి, కుంగుబాటుకు గురవుతున్నాడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నాడు

Delhi Police head constable shoots himself: నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి విపరీతమైన ఒత్తిడి, కుంగుబాటుకు గురవుతున్నాడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నాడు. క్ష‌ణికావేశంలో ఆత్య‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నలు త‌రుచు పోలీసు శాఖ‌లో జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు చేస్తున్న ఒత్తిడి భరించలేక ప్రాణాలు వదిలితే మరికొందరు కుటుంబ స‌మ‌స్య‌లతో చనిపోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. సంజయ్ అనే ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. రాజ‌స్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సంజ‌య్ ఢిల్లీలోని సాకేత్ పోలీస్‌స్టేష‌న్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్నాడు. ఎం జరిగిందో తెలీదు కానీ.. ఉన్న‌ట్టుండి సంజ‌య్‌ త‌న గన్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు. అతని ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఏమిటో తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. మృత‌దేహం వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ కూడా ల‌భ్యం కాలేదు. అయితే, సంజయ్ అన్న‌కు గ‌త కొంతకాలంగా ఆరోగ్యం బాగుండ‌టంలేద‌ని, ఎప్పుడూ సోద‌రుడి ఆనారోగ్యం గురించి చెబుతూ బాధ‌ప‌డేవాడ‌ని, ఆ ఒత్త‌ిడి వ‌ల్లే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు త‌మ‌ ప్రాథ‌మిక విచార‌ణలో భాగంగా అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories