logo
జాతీయం

సిద్దూ మూసావాలా కేసులో కీలక పురోగతి.. ముగ్గురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

Delhi Police Arrests Three Sharp Shooters who killed Sidhu Moose Wala
X

సిద్దూ మూసావాలా కేసులో కీలక పురోగతి.. ముగ్గురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

Highlights

*నిందితుల నుంచి గ్రేనేడ్లు, తుపాకులు రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Sidhu Moose Wala Case: సిద్దూ మూసావాలా కేసులో ఢిల్లీ పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీ గ్రనేడ్లు, డినోనేటర్లు, మూడు తుపాకులు, ఓ రైఫిల్‌ను స్వాధీనం చేసవారు. తాజాగా మీడియా ముందు నిందితులను పోలీసులు ప్రవేశపెట్టారు. మే 29న సింగర్‌ శుభదీప్‌ సింగ్‌ సిద్దూను కొందరు దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కాల్పుల్లో తమ హస్తం ఉందని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. తిహార్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్న లారెన్స్‌ బిష్ణోయ్‌ హత్యకు వ్యూహ రచన చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ మేరకు ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. జూన్‌ 15న బిష్ణోయ్‌ను పోలీసులు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఏడు రోజుల రిమాండ్‌ విధించడంతో పంజాబ్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Web TitleDelhi Police Arrests Three Sharp Shooters who killed Sidhu Moose Wala
Next Story